రైల్వేకోడూరు : మండలంలోని బుడుగుంటపల్లి, అయ్యవారిపల్లి మీదుగా కోడూరుకు వచ్చే రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మానానికి రూ.10.60 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులకు శుక్రవారం రాజంపేట పార్లమెంట్ సభ్యులు పి.వి.మిథున్‌రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంతో 26 గ్రామాల ప్రజలకు వాహనాల రాకపోకులకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. దశాబ్దాలకాలంగా అండర్ బ్రిడ్జి నిర్మాణం కలగానే మిగిలిందన్నారు. ఈ కల సహకారం కాబోతోందని తెలిపారు. కార్యక్రమంలో ఐఆర్‌ఎస్ కో-ఆర్డినేటర్ అక్కిరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్‌రెడ్డి, వైస్ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎం.హేమనవర్మ, జడ్‌పిటిసి రత్నమ్మ, వైసిపి సీనియర్ నాయకులు కొల్లం గంగిరెడ్డి, ఒజి శ్రీనివాసులురెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సుబ్బరామరాజు, సర్పంచి శివయ్య, ఉప సర్పంచ్ తోట శివసాయి, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రశాంతి, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, సాయి కిషోర్‌రెడ్డి, న్యాయవాది సురేష్, సర్పంచ్ దార్ల చంద్రశేఖర్ పాల్గొన్నారు.