Sep 08,2023 21:58

ఫొటో : ర్యాలీ నిర్వహిస్తున్న బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యులు

రైల్వే అభివృద్ధి కోసం ఉద్యమం తీవ్రతరం
ప్రజాశక్తి-బిట్రగుంట : బిట్రగుంటలో రైల్వే పరంగా ఉన్న సదుపాయాలను తగ్గిస్తే సహించబోమని ప్రజలందరి చైతన్యపరిచి భవిష్యత్తులో బిట్రగుంట రైల్వే కోసం అరెస్టులకైనా సిద్ధమేనని బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ అధ్యక్షులు షేక్‌ నూరుద్దీన్‌ అన్నారు. రిజర్వేషన్‌ కౌంటర్‌ నిలుపుదలకు నిరసనగా బోగోలు అంబేద్కర్‌ విగ్రహం వద్ద నుండి బిట్రగుంట రైల్వే స్టేషన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సిపిఎం కార్యదర్శి తుమ్మల వెంకయ్య, మండల సిఐటియు కార్యదర్శి చల్లా నరహరి, జై భీమ్‌ అంబేద్కర్‌ సేవా బత్తుల రవిచంద్ర మాట్లాడుతూ కరోనా సమయంలో రద్దు చేయబడ్డ రైలులో కొనసాగించకపోతే రైల్వేస్టేషన్‌ ముట్టడి చేపడతామన్నారు.
పార్లమెంటు సభ్యులు ఒకటే హెచ్చరిస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో రద్దు చేయబడ్డ రైళ్లను కొనసాగించకపోయిన బిట్రగుంట్ల ఉన్న రైల్వే రిజర్వేషన్స్‌ సౌకర్యాన్ని తొలగించే నిర్ణయం మానుకోకపోతే పార్లమెంటు ఓట్లు నోటాకు వేస్తామని, హెచ్చరిస్తున్నామన్నారు. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు బిట్రగుంట ప్రాంత వ్యాపారస్తులకు, యువతకు, మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బిట్రగుంట స్థాయిని తగ్గించే విధంగా రైల్వే శాఖ తీసుకుంటున్న నిర్ణయాలకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. రిజర్వేషన్‌ కౌంటర్‌ ఎత్తివేస ప్రక్రియను మానుకోవాలని వినతి పత్రాన్ని స్టేషన్‌ మేనేజర్‌కు అందించారు. మెయిల్‌ ఫ్యాక్స్‌ ద్వారా జనరల్‌ మేనేజర్‌, డివిజనల్‌ మేనేజర్‌ వారికి పంపుతామన్నారు. కార్యక్రమంలో కావలి జనసేన నాయకులు సిద్ధు, బిజెపి జిల్లా నాయకులు భరత్‌, మండల నాయకులు నూకసాని శ్రీనివాసులు, బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యులు మెతుకు రాజేశ్వరి, అఖిల భారత మానవ హక్కుల పరిరక్షణ సమితి ప్రకాశం జిల్లా అధ్యక్షులు దాసరి సునీల్‌, కాంగ్రెస్‌ మండల నాయకులు షేక్‌ జహీర్‌, ఎస్‌ఆర్‌కె స్కూల్‌ ప్రిన్సిపాల్‌ గోపిశెట్టి శ్రీహరి, వ్యాపారస్తులు, యువకులు మహిళలు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు.