కడప అర్బన్ విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరం అని మతులకు డివైఎఫ్‌ఐ జిల్లా కమిటీిగా నివాళులు అర్పిస్తున్నమని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ అన్నారు. సోమవారం స్థానిక పులే సర్కిల్ లో డివైఎఫ్‌ఐ అధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం దేశంలో ఏదోఒక చోట రైలు ప్రమాదాలు సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న ఒడిస్సాలో భారీ రైలు ప్రమాద ఘటన మరువక ముందే మన రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద ఘటన జరగడం శోచనీయమని పేర్కొన్నారు. రెండు ప్రమాద ఘటనలలో సిగలింగ్ వ్యవస్థ కారణంగానే అధికారులు చెబుతున్నారని తెలిపారు. మారుతున్న కాలంలో పెరుగుతున్న టెక్నాలజీ ద్వారా ఇంకా సిగలింగ్ లోపం కారణంగా ప్రమాద ఘటనలు చోటుచేసుకోవడం దురదష్టకరం అన్నారు. కేంద్రం ఇప్పటికైనా గుర్తించి రైల్వే సిగలింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పని భారం తో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వెంటనే రైల్వేలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి సరైన సదుపాయాలతో చికిత్స చేయాలని, మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నగర అధ్యక్ష, కార్యదర్శులు షాకీర్, డిఎం ఓబులేష్, నగర ఉపాధ్యక్షులు విజరు, ఉదరు పాల్గొన్నారు.