Aug 13,2023 21:43

మృతుడు దుర్గాప్రసాద్‌

పార్వతీపురంరూరల్‌ : స్థానిక పట్టణ రైల్వే స్టేషన్‌కు సమీపంలో రైలు ఢకొీని యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం పాలకొండ మండలం అన్నవరం గ్రామానికి చెందిన గొట్టాపు దుర్గాప్రసాద్‌ (19) బైపాస్‌ కాలనీలో నివాసం ఉంటున్న అతని అమ్మమ్మ తూముల దుర్గమ్మ ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్తానని చెప్పి ఇంటి నుండి బయటికి వెళ్లాడు. విశాఖపట్నం నుండి రాయగడ వైపు వెళ్లే రైలు ఢకొీని మృతి చెందాడు. రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ డి.రత్నకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.