Aug 13,2023 22:22

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
            పెంచిన రైల్వే టికెట్‌ ఛార్జీలు తగ్గించాలని, రద్దు చేసిన ప్యాసింజర్‌ రైళ్లు పునరుద్ధరించాలని, రైల్వే ప్రయివేటీకరణ నిలుపుదల చేయాలని సిపిఎం పెంటపాడు మండల కమిటీ, తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గుడ్‌ షెడ్‌ వర్కర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పెంటపాడులో ఆదివారం ఆందో ళన చేశారు. ఈ సందర్భంగా చిర్ల పుల్లారెడ్డి, సత్తి కోదండరామి రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరోనా వచ్చినప్పటి నుంచి ప్యాసింజర్‌ రైళ్లు రద్దు చేసిందన్నారు. కరోనాకు ముందే విజయవాడ-విశాఖపట్నం ప్యాసింజర్‌ రైలు రద్దు చేసిందని తెలిపారు. అన్ని రైళ్లను ఎక్స్‌ప్రెస్‌గా మార్చి సామాన్యులు రైలు ప్రయాణానికి భయపడేటట్లుగా ్చ టికెట్‌ రేట్లు పెంచిందన్నారు. రైల్వేను ప్రయివేటుపరం చేయడంతో, లక్షలాది పోస్టులు భర్తీ చేయకపోవడంతో, అన్ని పోస్టులు కాంట్రాక్టు ఇవ్వడంతో రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ నెల ఐదో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పేరుతో ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారన్నారు. ఆధునికీకరణ చేసి ప్రయివేట్‌వారికి అప్పజెప్పడాని కేనన్నారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ప్యాసింజర్‌ రైళ్లు తిరిగి పునరుద్ధరించాలని, టిక్కెట్‌ ఛార్జీలు తగ్గించాలని, రైల్వే ప్రయివేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కర్రి సాయిరెడ్డి, అడపా ఆంజనేయులు, గాది వెంకట్రావు, ఎస్‌విఎస్‌.రెడ్డి, కర్రి సుబ్బిరెడ్డి, ఎ.నారాయణ, బుద్దాల నాని, మద్దాల పుత్రయ్య, ఆండ్రపు కృష్ణ, అడ్డగర్ల కృష్ణ, కర్రి శ్రీనివాస్‌రెడ్డి, టిఎన్‌.రెడ్డి, జివి.భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు
.