ప్రజాశక్తి - కొయ్యలగూడెం
కుంతలగూడెం ఎంపియూపి స్కూల్ ఉపాధ్యాయులు రాయపూడి వెంకటరమణకు ఉపాధ్యాయ రత్న పురస్కారం దక్కింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ డాక్టర్ జి.చంద్రయ్య ద్వారా పురస్కారాన్ని అందుకున్నట్లు రాయపూడి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణకు చెందిన ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ 17వ వార్షికోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రతిభను కనబరుస్తున్న 50 మందిని గుర్తించి ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్.నందా పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాయపూడిని ఎంఎల్‌సి షేక్ సాబ్జీ, యుటిఎఫ్ నాయకులు అభినందించారు.










