Jun 23,2023 19:19

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని కెజిఎన్‌ ఫంక్షన్‌ హాలులో ఈనెల 30న జరిగే 'రాయలసీమ కళా జాతా'ను జయప్రదం చేయాలని ఆర్‌సిసి పొలిటికల్‌ ఆర్గనైజర్‌ రాజు కోరారు. శుక్రవారం పట్టణంలోని కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయ తప్పుడు విధానాలు, నిర్లక్ష్యం మూలాన రాయలసీ వెనుకబాటుకు గురైందని తెలిపారు. దేశ, రాష్ట్ర రాజకీయ రంగాలకు ఉద్ధండులైన రాజకీయవేత్తలను అందించిన ఈ ప్రాంతం సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. శ్రీబాగ్‌ ఒప్పందం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం రాయలసీమలోని ప్రతి గ్రామానికీ తాగు, సాగునీరు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కోసం పోరాడాలని కోరారు. పిడిఎస్‌ఒ రాష్ట్ర నాయకులు తిరుమలేష్‌, ఎఐఎఫ్‌టియు నాయకులు హుస్సేని, ఆర్‌సిసి రాష్ట్ర నాయకులు ప్రతాప్‌, శాంతారాజు, రజకుమార్‌, సుధాకర్‌, రవి వర్మ పాల్గొన్నారు.