రాయలసీమ హక్కులు కాపాడుకునేందుకు సంతకాలు
రాయలసీమ స్టీరింగ్ కమిటీ
ప్రజాశక్తి - నంద్యాల
రాయలసీమ హక్కులు కాపాడుకునేందుకు గ్రామాల్లో సంతకాల సేకరణ ముమ్మరంగా జరుగుతుందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ నంద్యాల జిల్లా నాయకులు యం. వి. రమణారెడ్డి అన్నారు. ఆదివారం నంద్యాల మండలం పోలూరు, మునగాల, రాయమాలుపురం గ్రామాల్లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా నాయకులు రమణారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ కరువుకు కారణాలు వివరిస్తూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఉద్యమం చేస్తుందని, అందులో భాగంగానే సంతకాల సేకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయడం జరుగుతుందన్నారు. వారం రోజులు గ్రామాల్లో, నంద్యాల పట్టణంలో సంతకాల సేకరణ జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమం లో భాగంగా మునగాల మాజీ సర్పంచ్ తూము విశ్వనాధ్ రెడ్డి, బిజెపి నియోజకవర్గం నాయకులు తూము శివారెడ్డి, పోలూరు నాయకులు జమాల్, నాగయ్య, పుల్లయ్య, నారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రాయమాలుపురం గ్రామ నాయకులు దేవసహాయం, శ్రీనివాసులు, వెంకటయ్య, రమేష్, సాగర్ తదితరులు పాల్గొని ఇంటింటికి కరపత్రాలు పంపిణి చేశారు.










