ప్రజాశక్తి-కొయ్యూరు
రైతులకు రాయితీపై కిసాన్ డ్రోన్లు సరఫరా చేయనున్నట్లు మండల వ్యవసాయశాఖ అధికారి ఉమాదేవి తెలిపారు. మండలంలోని మర్రివాడ రైతు భరోసా కేంద్రాన్ని బుధవారం ఆమె సందర్శించారు. రికార్డులను పరిశీలించి, ఈ-పంట నమోదు, ఇతర అంశాలపై చర్చించారు. రైతులతో మాట్లాడి కిసాన్ డ్రోన్లు, వాటి వినియోగం గురించి తెలిపారు. కిసాన్ డ్రోన్ ఖరీదు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుందని, దీన్ని ప్రభుత్వం వారు రాయితీ మీద సరఫరా చేస్తుందని చెప్పారు. గ్రూపుగా గాని, వ్యక్తిగతంగా గాని దీనిని పొందవచ్చని తెలిపారు. కిసాన్ డ్రోన్ల ద్వారా పురుగుమందులు పిచికారీ సులభతరంగా చేయొచ్చని, ఎకరానికి పిచికారీకి దాదాపు 20 నిమిషాల్లో సమయం సరిపోతుందన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, వ్యవసాయ పాలిటెక్నిక్ చదువుకున్న వారు వీటిని పొందేందుకు అర్హులని, ఆసక్తి గల అభ్యర్థులు రైతు భరోసా కేంద్రంలోగాని, మండల వ్యవసాయ కార్యాలయంలోగాని సంప్రదించాలని కోరారు.










