రాయచోటి : సినీ నటి, యాంక్ అనసూయ రాయ చోటి పట్టణంలో సందడి చేశారు. పట్టణంలోని ఎస్ ఎన్ కాలనీలో ఏర్పాటు చేసిన ఎంజిఆర్ షాషింగ ్‌మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె విచేశారు. అనసూయను చూసేందుకు పట్టణంలోని యువత, ప్రజలు భారీ స్థాయిలో వచ్చారు. షాపింగ్‌మాల్ యాజ మాన్యం ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డితో కలిసి షాపింగ్‌మాల్‌ను ప్రారంభించి, చీరలు, డ్రెస్సులను పరిశీలించారు. రాయచోటికి రావడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. ఎంఆర్‌జి షాపింగ్ మాల్ దినదినాభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆర్. రమేష్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, వైసిపి సీనియర్ నాయకులు జమాల్ ఖాన్, జానం రవీంద్ర యాదవ్, ఫయాజ్ అహమ్మద్, పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అర్బన్ సుధాకర్ రెడ్డి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
సత్యం సిల్క్ అండ్ రెడీమెడ్ షో రూమ్ ప్రారంభం
రాయచోటి టౌన్ : జిల్లా కేంద్రమైన రాయచోటిలో పట్టు వస్త్రాలయం ఏర్పాటు కావడం హర్షణీయమని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురు వారం రాయచోటి పట్టణం కొత్తపేటలో ప్రొపరైటర్ రమేష్‌చే ఏర్పాటైన సత్యం సిల్క్ అండ్ రెడీమెడ్ షో రూమ్ ప్రారంభంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషతో కలసి ముఖ్య అతిధిగా అయన పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజల్వన చేసి షో రూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించి మన్ననలను పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రామాపురం జడ్‌పిటిసి మాసన వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, మండల బిసి నాయకుడు పల్లపు రమేష్, జానం రవీంద్ర యాదవ్, ఫయాజ్ అహమ్మద్, వైఎస్‌ఆర్ సిపి కువైట్ లీడర్ ఎ.వి.సుబ్బారెడ్డి, కనపర్తి చెన్నారెడ్డి పాల్గొన్నారు.