Aug 02,2023 21:26

మున్సిపల్‌ కార్యాలయం

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
 రాయచోటి టౌన్‌ : రాయచోటి మున్సిపాలిటీకి హోదా పెరిగింది. గ్రేడ్‌ - 1 నుంచి స్పెషల్‌ గ్రేడ్‌గా ఆప్‌ గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం నుంచి జిఒఎ నంబర్‌ 104 ను జారీచేశారు. గతంలో గ్రేడ్‌ - 3 గా ఉన్న మున్సిపాలిటీని గ్రేడ్‌ -1 గా శ్రీకాంత్‌ రెడ్డి అప్‌ గ్రేడ్‌ చేయించి మున్సిపాలిటీ అభివద్ధికి కషి చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ హయాంలో పంచాయతీ నుంచి 2005 ఏప్రిల్‌ 29న రాయచోటి పట్టణం థర్డ్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా అవతరించింది. మున్సిపాలిటీ అయ్యాక 31 వార్డులు ఏర్పడ్డాయి. శ్రీకాంత్‌ రెడ్డి కషితో గ్రేడ్‌ -3 నుంచి గ్రేడ్‌ అప్‌ గ్రేడ్‌గా అభివద్ధి చెందింది. రాయచోటిని జిల్లా కేంద్రం చేయించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపును తెచ్చారు. ప్రస్తుతం గ్రేడ్‌ 1 నుంచి స్పెషల్‌ గ్రేడ్‌ గా అప్‌ గ్రేడ్‌ చేయించారు. మదనపల్లె మున్సిపాలిటీతో సమానంగా రాయచోటి మున్సిపాలిటీ సెషల్‌ గ్రేడ్‌ అయింది. ప్రస్తుత మున్సిపాలిటీ ఆదాయం రూ.6 కోట్లకు పైబడి ఉంది. పట్టణంలో సుమారు ఒక లక్ష పదివేల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. నిత్యం రాయచోటి పట్టణానికి ఇతర ప్రాంతాలనుంచి వివిధ అవసరాల నిమిత్తం 10 వేల మందికి పైగా వచ్చి వెళుతుంటారు. కాగా పట్టణ ప్రజలకు మున్సిపాలిటీ ద్వారా అందించే సేవలు, అభివద్ధి పనులు పెరగాలంటే స్థానికంగా సమకూరే నిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే నిధులతో పాటు హడ్కో లాంటి ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణాలు కూడా అవసరమవుతాయి. ఆర్థికంగా మున్సిపాలిటీకి ఉన్న జవసత్వాలను ప్రామాణికంగా తీసుకుని, పట్టణంలో నివసిస్తున్న జనాభాను కొలమానికంగా అందించాల్సి సేవలు, వాటిని మెరుగుపరచాల్సింన అంశాలపై ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు ఆసక్తి చూపుతాయి. ప్రభుత్వాలు నిధుల కేటాయింపు, వివిధ పథకాలను అమలు పరిచే విషయంలో గ్రేడ్‌ 1 మున్సిపాలిటీల కంటే స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీలకు అధిక ప్రాధాన్యతలుంటాయి. లక్ష జనాభాకు పైగా ఉన్న రాయచోటి పట్టణ ప్రజలకు మరిన్ని సౌకర్యాలు మున్సిపాలిటీ ద్వారా అందించడానికి స్పెషల్‌ గ్రేడ్‌ హోదా దోహదపడుతుంది. సిబ్బంది పెరిగి ప్రజలకు మరిన్ని సేవలు త్వరితగతిన అందుతాయి.
రాయచోటి మున్సిపాలిటీ గ్రేడ్‌ - 1 నుంచి స్పెషల్‌ గ్రేడ్‌గా ఆప్‌ గ్రేడ్‌ కావడంపై మున్సిపాలిటీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రేడ్‌ 3 నుంచి గ్రేడ్‌ 1 గాను, జిల్లా కేంద్రం గాను, మున్సిపాలిటీ గ్రేడ్‌ - 1 నుంచి స్పెషల్‌ గ్రేడ్‌గా ఆప్‌ గ్రేడ్‌ చేయించేందుకు, మున్సిపాలిటీ అభివద్ధికి మొదటి నుంచి విశేష కషి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి ప్రజలు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది కతజ్ఞతలు తెలిజయజేశారు. స్పెషల్‌ గ్రేడ్‌ గా ఆప్‌ గ్రేడ్‌ కావడంతో పట్టణం మరింత అభివద్ధి చెందుతుందని మున్సిపాలిటీ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.