
ప్రజాశక్తి - పాలకొల్లు
పాలకొల్లు ప్రముఖ న్యాయవాది రావూరి చాచా కుమారుడు రావూరి అభిషేక్ గ్రూప్-1 ఫలితాల్లో రాణించి డిఎస్‌పిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రావూరి అభిషేక్‌కు డిసిఎంఎస్ మాజీ ఛైర్మన్ యడ్ల తాతాజీ అభినం దనలు తెలిపారు. శనివారం ఆయన స్వగృహం వద్ద స్వయ ంగా కలిసి భవిష్యత్తులో సివిల్స్ సాధించి పాలకొల్లుకు మంచి పేరు తీసుకురావాలని ఆశించారు. ఆయనతో పాటు కొంతేరు శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు పెచ్చెట్టి కృష్ణాజి, మాజీ కౌన్సిలర్ రేలంగి శ్రీను, మాజీ సర్పంచి గంటా నరేష్, అల్లం బుజ్జి, కర్పూరం వెంకటేశ్వరరావు, అడ్డాల వాసు పాల్గొన్నారు.