Jun 25,2023 21:52

ఫొటో : సర్వేను పరిశీలిస్తున్న ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌

రావులకొల్లులో 'జగనన్న సురక్ష'
ప్రజాశక్తి ఆత్మకూరు అర్బన్‌ : మండలంలోని చేర్లోయడవల్లి గ్రామ సచివాలయ పరిధిలోని రావులకొలు గ్రామంలో గ్రామ వలంటీర్లతో జగనన్న సురక్ష కుటుంబాల సర్వే జరిగే కార్యక్రమానికి ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌ హాజరయ్యారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ 100 శాతం సర్వే పూర్తి చేయాలని వలంటీర్లుకు సూచనలు జారీ చేశారు.
జగనన్న సురక్ష కార్యక్రమం సంబంధించి ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో రావులకొల్లు వైసిపి నాయకులు రామిరెడ్డి మోహన్‌ రెడ్డి, సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.