- ఎంపీ రామ్మోహన్ నాయుడు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: పూర్వ రచయితలు రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావిశాస్త్రి) ఆదర్శప్రాయులని, నేటి రచయితలు, కవులు వారిని ఆదర్శంగా తీసుకొని తెలుగు భాషాభివృద్ధికి పాటు పడాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా రావిశాస్త్రి బ్రోచర్‌ని ఆదివారం అవిస్కరించారు. ఈ సందర్భంగా విద్యావేత్త, పూర్వ డిఇఒ బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ సాహితీ చైతన్య కిరణాలు అధ్యక్షులు బోగెల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యాన పూర్వ రచయతలను గుర్తించుకుని వారి జయంతి నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కవి ఉమ మాట్లాడుతూ రావిశాస్త్రి జిల్లాలో జన్మించి న్యాయవాదిగా పనిచేసి మంచి రచయితగా పేరుపొందారని అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మాండలీకంలో అనగారిన ప్రజల తరుపున ఆవేదన సాహిత్యంతో రచనలు చేశారని అన్నారు. చైతన్య స్రవంతి, కథాసాగరం, బివేర్, గోల్డ్, అల్పజీవి, రత్తాలు-రాంబాబు, రాచకొండ కథలు రచించారని అన్నారు. కార్యక్రమంలో డబ్బీరు గోవిందరావు, డబ్బీరు వాసు, వెంకటరావు, సదాశివుని కృష్ణ, రామచంద్రరావు, శర్మ పాల్గొన్నారు.










