
గుంటూరు సిటీ: రాత్రి వేళలో పని చేసే పోలీస్ శాఖ సిబ్బంది పనితీరును గమనించేందుకై గురువారం రాత్రి జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఆఫీజ్ అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వ హించారు. రాత్రి సమయంలో విధులు నిర్వహించే సిబ్బందితోపాటు పెట్రో లియంలో వాహనాలులో తిరిగే సిబ్బందిని వైర్లెస్ సెట్లు ద్వారా సంప్రదింపులు జరిపారు. నగరంలో రాత్రివేళలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగ కుండా గస్తీ ముమ్మరం చేస్తూ అప్ర మత్తంగా ఉండాలన్నారు.అర్ధరాత్రి సమ యాల్లో తిరిగే వారిని విచారించి, అనుమానితులు ఎవరైనా ఉంటే వారిని స్టేషన్ కు తీసుకొచ్చి ,విచారించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాతగుంటూరు సి.ఐ సుబ్బా రావుతోపాటు లాలాపేటలో రాత్రి విధులు నిర్వహిసున్న యస్ ఐ అమర వర్ధన్ పాల్గొన్నారు.