Aug 23,2023 21:23

మాట్లాడుతున్న కలెక్టర్‌

మాట్లాడుతున్న కలెక్టర్‌
రాతపూర్వకంగా అభ్యంతరాలు తెలపాలి
ప్రజాశక్తి-నెల్లూరు:ఓటర్ల జాబితా సవరణలలో రాజకీయ పార్టీలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులకు (ఈఆర్‌ఒ ) రాతపూర్వకంగా తెలియజేయాలని కలెక్టర్‌ ఎం .హరి నారాయణన్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా ఇంటింటి సర్వే పై కలెక్టర్‌ ఛాంబర్‌ లో బుధవారం వారాంతపు సమావేశం నిర్వహించారు. తప్పులు లేని, స్వచ్ఛమైన ,ఖచ్చితమైన ఓటర్ల జాబితా తయారీకి జిల్లా యంత్రాంగం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నదని, అందుకు అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ మాట్లాడుతూ ఈసారి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వారానికి ఒకసారి రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారి సలహాలు, సూచనలు, సమస్యలు తెలుసు కుంటున్నామన్నారు. ఓటర్లు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా చేపడుతున్నామన్నారు. చాలాచోట్ల బి ఎల్‌ వో లు బాగా పనిచేస్తున్నారని, కొన్నిచోట్ల బిఎల్వోలతో సమస్యలు ఉన్నాయని టిడిపి ప్రతినిధులు కలెక్టర్‌ దష్టికి తేగా, ఎక్కడ , ఏ బి ఎల్‌ ఒ తో సమస్య ఉందో స్పష్టంగా తెలియజేస్తే చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇంటింటి సర్వేలో బూత్‌ లెవెల్‌ అధికారులతో బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు ఉంటే ఏ విధమైన అభ్యంతరం లేదని కలెక్టర్‌ వారికి స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు ప్రతినిధులు ఓటర్ల జాబితా తీసుకుని ఇంటి ఇంటికి తిరిగి తనిఖీ చేయవచ్చో లేదో ఎన్నికల సంఘం దష్టికి తీసుకువెళ్లి సమాధానం ఇస్తామనీ చెప్పారు. సురక్షితమైన, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటినుండి ఎన్నికల సంఘం అనేక జాగ్రత్తలు తీసుకుంటుందని కలెక్టర్‌ అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటనారాయణమ్మ మాట్లాడుతూ జూలై 21 నుండి ఆగస్టు 21 వరకు డోర్‌ టు డోర్‌ సర్వే , ఓటర్ల పరిశీలన పూర్తయిందని అన్నారు. వచ్చిన క్లైమ్లను నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరిస్తున్నామన్నారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి చర్యలు తీసుకుంటున్నాము అన్నారు.జాబితా సవరణపై ఎన్నికల సంఘం ప్రత్యేక దష్టి సారించి ప్రతివారం సమావేశాలు నిర్వహించి వివరాలను రాజకీయపక్షాలకు తెలియజేయడం హర్షనీయమని వైయస్సార్సీపి అధికార ప్రతినిధి ఎం వి శేషయ్య తో పాటు బిజెపి జిల్లా జనరల్‌ సెక్రెటరీ శ్రీనివాస్‌, ఐ ఎన్‌ సి పార్టీ ప్రతినిధి కొండ అనిల్‌ కుమార్‌, తదితరులు ప్రశంసించారు.ఈ సమావేశంలో టిడిపి ప్రతినిధులు చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, భువనేశ్వర ప్రసాద్‌, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయాకర్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్‌ ధరణీ కుమార్‌ పాల్గొన్నారు.