Jul 08,2023 00:10
విద్యార్థులను అభినందిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్‌ రవికుమార్‌

ప్రజాశక్తి-చీరాల: చీరాల ఇంజనీరింగ్‌ కళాశాలలో పాలిటెక్నిక్‌ ఈసీ మూడో సంవత్సరం విద్యార్థి 96.7 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా శుక్రవారం కళాశాలలో జరిగిన అభినందన సభలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి రవికుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలలో అడుగుపెట్టే సమయంలోనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. దాని ప్రకారం ప్రణాళికా బద్ధంగా చదివితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కళాశాలలో చదువు, సంస్కారం నేర్చుకుని ఉత్తమ పౌరుడుగా తయారైనప్పుడే తల్లిదండ్రులు సంతోషిస్తారని అన్నారు. సుబ్బారెడ్డి రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చూపటం అభినందనీయమన్నారు. విద్యార్థులును ఉత్తమ పౌరులుగా నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా తీర్చి దిద్దేందుకు కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లటంతోనే సుబ్బారెడ్డి మంచి ఫలితాలు సాధించాడని తెలిపారు. మిగిలిన విద్యార్థులు సుబ్బారెడ్డిని ఆదర్శంగా తీసుకొని అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి మరింత ఉన్నత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సుబ్బారెడ్డితో పాటు అత్యధిక మార్కులు సాధించిన కె విగేష్‌ 93.9 శాతం మార్కులు, టీ నాగ సుదర్శన్‌ 92.9, ఎం లిఖిత 86 శాతం మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఓ ఫణి కుమార్‌, ఈసి హెచ్‌ఓడి, ఆర్‌వి రమణయ్య, సీఎంఈ హెచ్‌ఓడి మణికంఠ, ఇంజనీరింగ్‌ విభాగం సిఎస్సి హెచ్‌ఓడీ డాక్టర్‌ సౌజన్య, ఇసి హెచ్‌ఓడి రాధాకుమారి, అధ్యాపకులు రత్నకుమార్‌, జాన్‌ వర కుమార్‌, మణి కుమార్‌ పాల్గొన్నారు.