Nov 16,2023 23:30

ప్రజాశక్తి - బాపట్ల
దేశంలో శాస్త్ర, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలు సైన్స్ పట్ల విద్యార్థులు ఆసక్తి పెంపొందించుకోవాలని సైన్స్ జిల్లా అధికారి మహమ్మ ద్ సాదిక్ అన్నారు. బాపట్ల జిల్లా జాండ్రపేట బీవీ అండ్ బీఎన్ ప్రభుత్వ పాఠశాలలో ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (అప్కాస్ట్) ఆధ్వర్యంలో   నిర్వహించిన 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయిలో 25 మండలాల నుండి 93ప్రాజెక్టులు పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. అయితే 7 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల మరింత ఆసక్తిని పెంపొందించడమే జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఉద్దేశ్యమని అన్నారు. గుళ్లాపల్లి జెడ్‌పి ఉన్నత పఠశాల విద్యార్ధిని బి కశ్వశ్రీ ప్రదర్శించిన మీనామృతం, వడ్డేవారిపాలెం జెడ్‌పి హెచ్‌ స్కూల్‌ విద్యార్దిని వి శ్రావ్య ప్రదర్శించిన హనీ బీ ట్రాన్స్ ఫార్మింగ్, మక్కెనవారిపాలెం జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్ధిని జి రాగనాగ అనిషిత ప్రదర్శించిన గ్రీన్ వాష్, గంగవరం ఎస్‌వికె హైస్కూల్‌ విద్యార్ధిని పి అంకిత ప్రదర్శించిన బుల్లెట్ మిల్లెట్స్, చినమట్లపూడి జెడ్‌పి హైస్కూల్‌ విద్యార్ధిని కె భవ్యశ్రీ ప్రదర్శించిన పశుసంవర్ధని దాణామృతం, సజ్జాపురం జెడ్‌పి హైస్కూల్‌ విద్యార్ధిని వి బాల అమూల్య ప్రదర్శించిన ట్రెడిషనల్ రెమెడీస్ ఫర్ ఎనీమియా, జాండ్రపేట బివి అండ్‌ బిఎన్‌ స్కూల్‌ విద్యార్దిని ప్రదర్శించిన ఫ్లోటింగ్ లాడిల్స్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. సైన్స్‌ ఉపాధ్యాయులు లేళ్ల లీలా కృష్ణ, వలివేటి వెన్నెల, కిరణ్ నందమూడి, మీర్జాన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినట్లు తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు, మొమెంటోలను డిఇఒ పివిజే రామారావు అందజేశారు.