Dec 19,2022 23:31

సర్టిఫికెట్లు చూపిస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి- చోడవరం
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరిగిన యోగా పోటీలలో చోడవరం పతంజలి యోగ శిక్షణ కేంద్రానికి చెందిన తొమ్మిది మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారు. 8 నుండి 12 సంవత్సరాల బాలుర విభాగంలో జి.హేమంత్‌ శ్రీను, బి.చరణ్‌, పి.హరీష్‌, 12 నుండి 14 సంవత్సరాల బాలురు విభాగంలో పి.క్రాంతి సాగర్‌, వి.పూర్ణచందర్రావు, ఎ.హేమంత్‌ కుమార్‌, 12 నుండి 14 సంవత్సరాల బాలికల విభాగంలో పి.వెన్నెలశ్రీ, 14 నుండి 17 సంవత్సరాల బాలురు విభాగంలో పి.పవన్‌ కుమార్‌, ఏ.జయరామ్‌ చరణ్‌ విజయం సాధించారు. వీరంతా ఈనెల 25 తిరుపతిలో జరగబోయే రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారని యోగ గురువు పుల్లేటి సతీష్‌ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు పతంజలి యోగ శిక్షణ కేంద్ర చైర్మన్‌ పసుమర్తి అశోక్‌, అడ్వకేట్‌ శ్రీనివాసరావు, ఓరుగంటి రాంబాబు, ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్‌ జెర్రిపోతుల రమణాజీ, యోగా టీచర్స్‌ భోగవిల్లి గణేష్‌, కొట్టాపు హరి కిరణ్‌, పసుమర్తి నానాజీ, రవితేజ తదితరులు అభినందించారు.