Sep 27,2023 21:16

ప్రజాశక్తి - టి.నరసాపురం
   రాష్ట్రస్థాయి యోగా పోటీలకు కేతవరం విద్యార్థిని కాసగాని మౌనిక ఎంపికైనట్లు హెచ్‌ఎం బి.కృష్ణ తెలిపారు. కేతవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ వారి ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీన ఎస్‌సిహెచ్‌బిఆర్‌ఎం ఉన్నత పాఠశాల భీమవరంలో నిర్వహించిన యోగాసన పోటీలలో బాలికల అండర్‌-14 విభాగంలో కేతవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని కాసగాని మౌనిక జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. విద్యార్థినికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు జి.రమేష్‌, యోగా ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.