ప్రజాశక్తి - ముసునూరు
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ముసునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మద్దాల సాగర్‌బాబు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం ఎ.సునీత మాట్లాడుతూ సాగర్‌బాబు ఎంపిక పట్ల ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈనెల 7, 8, 9 తేదీల్లో కడప జిల్లాలోని మైదుకూరులో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో సాగర్‌బాబు ఆడనున్నాడని తెలిపారు. ఆ పోటీల్లో మరింత ప్రతిభ కనబర్చి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థిని వ్యాయామ ఉపాధ్యాయులు మహ్మద్ ఆలీఖాన్, హేమదేవి, ఉపాధ్యాయులు జి.నాగేశ్వరరావు, ఫ్రాన్సిస్ అభినందించారు.










