Sep 21,2023 19:36

ప్రజాశక్తి - కలిదిండి
   రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ క్రీడా జట్టుకు భాస్కరరావు పేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు కె.పాండురంగారావు తెలిపారు. మండలంలోని భాస్కరరావు పేట జెడ్‌పిహెచ్‌ విద్యార్థులు ఈనెల 20వ తేదీన గుడివాడ ఎన్‌టిఆర్‌ స్టేడియంలో నిర్వహించిన అండర్‌ -14లో సిహెచ్‌ సుధా ధనలక్ష్మి, అండర్‌-17లో జె.ప్రసన్న రాణి, పి.మౌనిక, ఎస్‌.చరిష్మ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారన్నారు. రాష్ట్ర స్థాయి ఎస్‌జిఎఫ్‌ వాలీబాల్‌ పోటీలకు ఎంపికైన విద్యార్థులను, తర్ఫీదు ఇచ్చిన పిడిజి రవిని హెచ్‌ఎం కె.పాండురంగారావు, ఉపాధ్యాయులు అభినందించారు. గ్రామీణ స్థాయి విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.