Oct 09,2023 00:33

రాష్ట్రస్థాయి టెక్వాండో పోటీలకు పెరుమాళ్ళపల్లి విద్యార్థులు

రాష్ట్రస్థాయి టెక్వాండో పోటీలకు
పెరుమాళ్ళపల్లి విద్యార్థులు
ప్రజాశక్తి- సోమల: తిరుపతి రూరల్‌ పెరుమాళ్ళపల్లి జెడ్పి ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన టెక్వాండో స్థాయి పోటీలలో పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు పిఈటి బి.నాగమల్లేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రజాశక్తితో మాట్లాడుతూ తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలో అండర్‌ 17 టెక్వాన్డో పోటీలను పెరుమాళ్ళపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించడం జరిగిందని ఈ పోటీలలో దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారని ఇందులో తమ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయినట్టు తెలిపారు. పదవ తరగతి చదువుతున్న గీతిక, శివ, నవీన్‌, 9వ తరగతి చదువుతున్న కష్ణ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్టు తెలిపారు. పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ 2017 సంవత్సరం నుండి పెరుమాలపల్లె ఉన్నత పాఠశాలకు చెందిన 73మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి, 14 మంది జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని పతకాలు సాధించడం పీఈటి నాగమల్లేశ్వరి కషి ఫలితంగానే జరిగిందని అన్నారు. పాఠశాల నుండి విద్యార్థులు క్రీడల పరంగా మరింత అభివద్ధి చెంది రాష్ట్ర జాతీయస్థాయి పోటీలలో మెడల్స్‌ సాధించే విధంగా మరింత ప్రోత్సహించేందుకు పాఠశాలకు తన వంతు సహాయంగా 25వేల రూపాయల విరాళాన్ని అందజేస్తున్నట్లు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ప్రకటించారు. ఆదివారం నిర్వహించిన టైక్వాండో పోటీలలో పెరుమాళ్ళపల్లి పాఠశాలకే చెందిన ఏడు మంది విద్యార్థులు సిల్వర్‌, నలుగురు విద్యార్థులు కాన్స్య పతకాలను సాధించినట్లు ప్రధానోపాధ్యాయురాలు నాగమణి తెలిపారు. కాగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను, జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల సిబ్బంది అభినందించారు. పాఠశాల పేరును రాష్ట్రస్థాయిలో నిలుపుతున్న పీఈటీని ఘనంగా సన్మానించారు.