ప్రజాశక్తి-యలమంచిలి రూరల్
యలమంచిలి వైయస్సార్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 10 నుండి 12వ తేదీ వరకు మూడు రోజులు పాటు జరగనున్న రాష్ట్రస్థాయి క్యాడేట్ తైక్వాండో పోటీలకు సంబందించిన పోస్టర్‌ను తైక్వాండో ఆర్గనైజింగ్ సెక్రటరీ నగిరెడ్డి సత్యనారాయణ గురువారం క్రీడాకారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి 550 మంది క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. వాళ్ల వయసును బట్టి రెండు క్యాటగిరీలు వేరు చేసి, బాల, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన విజేతలు ఈనెల 29 నుంచి రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ములంపాక అచ్చం నాయుడు, అంతర్జాతీయ క్రీడాకారుడు దొరబాబు, ఎలమంచిలి తైక్వాండో క్లబ్ అధ్యక్షులు నగిరెడ్డి దొరయ్య, జాతీయ క్రీడాకారులు, తైక్వాండో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.










