ప్రజాశక్తి-చెరుకుపల్లి: ఈ నెల 8,9 తేదీలలో నరసరావుపేటలో జరిగే రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఐదుగురు ఎంపికైనట్లు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ నర్గీస్ కాజీ తెలిపారు. సీనియర్ విభాగంలో ఇద్దరు, జూనియర్ విభాగంలో ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు ఆమె తెలిపారు. సీనియర్ విభాగంలో ఎం అఖిల్ సాయి, జూనియర్ విభాగంలో జె చరణ్ తేజ, టిఎల్ నారాయణ, డి చందన్ రఘు, వి ఈశ్వర్ నాగ శంకర్ ఎంపికైనట్లు ఆమె తెలిపారు. ఎంపికైన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ పైనం ఏడుకొండలరెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది విద్యార్థులను అభినందించారు.










