Aug 09,2023 22:11

ప్రజాశక్తి - నూజివీడు రూరల్‌
      గొల్లపల్లి గ్రామంలోని జడ్‌పి హైస్కూల్‌ విద్యార్థులు రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్‌ఎం పొట్లూరి రాధికా రాణి తెలిపారు. విజయవాడ గుణదలలో నిర్వహించిన జిల్లా జూనియర్‌ బాల బాలికల ఫెన్సింగ్‌ జట్ల ఎంపికలో ఐఉగ్ర, పి.నిఖిల్‌ కుమార్‌ ఎంపికైనట్లు పేర్కొన్నారు. వీరు ఆగస్టు 12, 13 తేదీలలో భీమవరంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.