Nov 29,2022 23:58

పోటీల్లో గెలుచుకున్న మెడల్స్‌ చూపుతున్న విద్యార్థులు

ప్రజాశక్తి-దేవరాపల్లి : వేచలం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు 11 విభాగాలలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఎస్‌జిఎఫ్‌ ఆధ్వర్యంలో ఈనెల 22న ఉమ్మడి విశాఖ జిల్లా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన పోటీలు అండర్‌-14 బాలుర విభాగంలో డి.గణేష్‌ 100 మీటర్లు, 200 మీటర్లు రన్నింగ్‌లోనూ, లాంగ్‌ జంప్‌లోనూ, కె.సాయి కార్తికేయ 80 మీటర్ల హాడిల్స్‌లోనూ, టి.రవిశంకర్‌ 5000 మీటర్ల నడకలోనూ, బి.చైతన్య లాంగ్‌ జంప్‌లోనూ, వి.ప్రవల్లిక హైజంప్‌లోనూ, ఎస్‌.రమ్య 200 మీటర్లు, 400 మీటర్లు రన్నింగ్‌లోనూ, 80 మీటర్ల హాడిల్స్‌లోనూ, కె.సౌజన్య 600 మీటర్ల రన్నింగ్‌లోనూ విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరందరూ డిసెంబర్‌లో శ్రీకాకుళంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పాఠశాల హెచ్‌ఎం డి.నరసింహమూర్తి తెలిపారు. 600 మీటర్ల రన్నింగ్‌ విభాగంలో సిహెచ్‌.మధు, 400 మీటర్ల హాడిల్స్‌లో వి.హరి ప్రసాద్‌ తృతీయ స్థానాలు సాధించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను, శిక్షణ ఇచ్చిన ఆర్‌.తమ్ముడునాయుడును పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ రెడ్డి శ్రీనివాస్‌, రెడ్డి పరమేష్‌, సర్పంచ్‌ నాగిరెడ్డి శటారీనాయుడు, ఎంపీటీసీ రెడ్డి శ్రీలక్ష్మి బలరాం, హెచ్‌ఎం నరసింహమూర్తి, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.