Dec 07,2022 21:59

ప్రజాశక్తి - చాట్రాయి
            ఈ నెల ఐదో తేదీన ఎస్‌జిఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్‌ స్టేడియం గుడివాడలో నిర్వహించిన అండర్‌ 14, 17 బాలుర విభాగంలో సాఫ్ట్‌బాల్‌, బేస్‌బాల్‌ క్రీడలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పోలవరం విద్యార్థులు రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మందపాటి కేశవరెడ్డి తెలిపారు. అండర్‌ 14 విభాగంలో సాప్ట్‌బాల్‌ క్రీడలో ఎనిమిదో తరగతి విద్యార్థి అమెర్ల సందీప్‌, బేస్‌బాల్‌లో పామర్తి నికిత్‌, అండర్‌ 17 సాఫ్ట్‌బాల్‌లో పదో తరగతి విద్యార్థి మొండ్రు హర్ష, బేస్‌బాల్‌లో దివ్వెల బాబి రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఎస్‌.సుబ్బారావును, వ్యాయామ ఉపాధ్యాయుడుని, విద్యార్థులను గ్రామ పెద్దలు పిఎసిఎస్‌ అధ్యక్షులు చెలికాని బాబ్జి, ఎస్‌ఎంసి ఛైర్మన్‌ పోరంకి విజరుకుమార్‌రాజు, ఎస్‌ఎంసి మాజీ ఛైర్మన్‌ వాళ్ల రవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మందపాటి కేశవరెడ్డి, స్టాఫ్‌ సెక్రటరీ పాకాల రత్తయ్య, ఉపాధ్యాయులు అభినందించారు.