Nov 02,2022 22:31

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
               స్థానిక డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ గురుకుల కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్‌ అరుణ తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం వివరాలు వెల్లడించారు. ఇటీవల పెదవేగిలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో జంగారెడ్డిగూడెం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ గురుకుల కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని తెలిపారు. బేస్‌ బాల్‌, సాప్ట్‌ బాల్‌ పోటీల్లో 19 సంవత్సరాల లోపు విద్యార్థులు ఏడుగురు, 17 సంవత్సరాలలోపు విద్యార్థులు తొమ్మిది మంది, 14 ఏళ్ల లోపు విద్యార్థులు పది మంది క్రీడా నైపుణ్యం కనపరిచారని తెలిపారు. త్వరలో నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రీడలకు ఈ విద్యార్థులందరూ అర్హత సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థినులను ఉమ్మడి జిల్లా గురుకుల కళాశాలల సమన్వయకర్త వాసవి, ప్రిన్సిపల్‌ అరుణ, వైస్‌ ప్రిన్సిపల్‌ సుజాత, ఫిజికల్‌ డైరెక్టర్‌ కె.విజయలక్ష్మి పిఇటి కె.వెంకటలక్ష్మి, సిబ్బంది అభినందించారు.