విద్యార్తిని అభినందిస్తున్న ఉపాధ్యాయులు
కురుపాం: ఈనెల 6 నుంచి 8వరకు గుంటూరు జిల్లా పల్నాడులో జరగబోయే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు మండలంలోని నీలకంఠాపురం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తిమ్మక దీపక్ ఎంపికైనట్లు వ్యాయమ ఉపాధ్యాయులు పత్తిక చంద్రమోహన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల ఉమ్మడి జిల్లా సీతానగరంలో జరిగిన అండం-17 వాలీబాల్ పోటీల్లో దీపక్ గెలిచాడని, దీంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆరిక గోవిందరావు, వార్డెన్ మల్లేశ్వరరావు, ఉపాధ్యాయులు కష్ణారావు, తిరుపతి అభినందించి హర్షం వ్యక్తం చేశారు.










