ప్రజాశక్తి - భీమడోలు
పెదవేగి గురుకుల పాఠశాల వేదికగా ఈనెల 21వ తేదీన నిర్వహించిన స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లాస్థాయి పోటీలలో గుండుగొలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పలువురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జికెడి సునీతతో పాటు పిడిలు వి.వెంకటేశ్వరరావు, పి.కృష్ణారావు పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ పాఠశాలకు చెందిన 17 మంది విద్యార్థులు అండర్-14, అండర్-17 విభాగాల్లో నిర్వహించిన సాప్ట్‌బాల్, బేస్ బాల్ పోటీలకు హాజరయ్యారన్నారు. వీరిలో 5 మంది రాష్ట్రస్థాయిలో నిర్వహించే రెండు పోటీలకు ఎంపిక కాగా, మిగిలిన నలుగురు ఒక్కొక్క పోటీకి జిల్లా ప్రతినిధులుగా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అండర్-17 విభాగంలో జి.ప్రేమ కుమార్, బివి.మణికంఠ, పి.సాయి చైతన్య, సిహెచ్‌ఎస్ గ్రేస్, వి.తేజస్విని రెండు పోటీలలో పాల్గొనే అర్హత సాధించారన్నారు. ఇక అండర్-14 పోటీ విభాగంలో జె.లక్ష్మీ ప్రసన్న సాప్ట్‌బాల్, టి.మున్నా బేస్‌బాల్ పోటీలకు, అండర్-17 విభాగంలో ఎస్.తనూజ గ్రేస్ బేస్ బాల్, వై.నాగదుర్గ సాప్ట్‌బాల్ విభాగంలో ఎంపికయ్యారని తెలిపారు.










