
ప్రజాశక్తి - మైలవరం : అండర్ 19 సాఫ్ట్వాల్, బేస్బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు స్థానిక లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ఆ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుని కే కనకదుర్గ మంగళ వారం తెలిపారు. ఈనెల తొమ్మిదో తేదీన విజయవాడలో అండర్ 19 ఉమ్మడి కష్ణాజిల్లా జట్ల ఎంపిక జరిగిందన్నారు. ఈ ఎంపికలో తమ పాఠశాలకు చెందిన వై.సందీప్, ఎం.కార్తీక్‌లు సాఫ్ట్బాల్‌లో, బేస్ బాల్‌లో పి.సందీప్ కుమార్, టి.అఖిల్, పి.విగేష్, బి.నాగ చరణ్, డిహెచ్‌బి సాయి కుమార్లు ఎంపికయ్యారన్నారు. త్వరలో కడప జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఈ నెల 8న కష్ణాజిల్లా కోకో అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్‌బి 18 ఎంపికైనట్లు తెలిపారు. ఈ ఎంపికలో బి.మౌనిక, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైందన్నారు.