ప్రజాశక్తి-తిరువూరు
జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి అండర్ 14 కబడ్డీ ఎంపిక పోటీలు జరిగాయి. తిరువురు మండలం మల్లేల నన్నక నరేంద్ర ధనలక్ష్మి మెమో రియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు వేము శ్రీలత, బాణా వతు శ్రీదేవిలు ఈ పోటీల్లో ప్రతిభ కనపర్చి రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేముల శ్రీధర్ తెలిపారు. కోకిలంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి గద్దలసిద్దు అండర్ 17 వి భాగంలో, 9వ తరగతి విద్యార్థి చింతి రాల సుమంత్ అండర్14 విభాగం ఖో ఖో పోటీలో పాల్గొని రాష్ట్ర స్థాయి పోటీ లకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుప్తా చెప్పారు. తిరువూ రు శ్రీనిధి స్కూల్ నుండి 8వ తరగతి విద్యార్ది ఎం.జోష్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ వెంక టనారాయణ తెలిపారు.










