
ప్రజాశక్తి-బాపట్ల
బాపట్ల జిల్లా స్థాయిలో టాటా కన్సల్టింగ్ సర్వీస్ 2023 జాతీయస్థాయి రూరల్ ఐటి క్విజ్ పోటీల్లో 23 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పివిజె రామారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో బాపట్ల ఏబీఎన్ హైస్కూల్లో నిర్వహించిన క్విజ్ పోటీలు నిర్వహించారు. ఎంపికైన వారిలో నగరం మండలం జిల్లా పరిషత్ హైస్కూల్ ఉల్లిపాలెంకు చెందిన జ్యోతిరావు సాయిపతి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అదేవిధంగా చెరుకుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి ఏ.పూర్ణేంద్ర మౌలీశ్వర్ రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులందరికీ ధ్రువీకరణ పత్రాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి తిమ్మాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన 50 మంది ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను, విద్యాశాఖ డీఈవో పివి.జే.రామారావు, జిల్లా సైన్స్ అధికారి మహమ్మద్ సాదిక్ అభినందించారు.