Oct 08,2023 00:34

రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థులు ఎంపిక

రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థులు ఎంపిక
ప్రజాశక్తి - కుప్పం
కుప్పం మండలం జడ్పీహెచ్‌ఎస్‌ చందం పాఠశాల నందు జిల్లా స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ అండర్‌ 17 విభాగం లో బాలబాలికల ఎంపిక జరిగింది. 9వ తరగతి చదువుతున్న లిఖిత్‌, పదవ తరగతి చదువుతున్న పూజ, అడవి బూదుగురు జడ్‌.పి.హెచ్‌.ఎస్‌ లో పదో తరగతి చదువుతున్న ఎన్‌ వెన్నెల, జడ్పీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల గరికిచినేపల్లి పదో తరగతి చదువుతున్న వినోద్‌ కుమార్‌, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల టి సదుమూరు ధనుష్‌ జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి అనంతపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను వ్యాయామ దర్శకులను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహచర సిబ్బంది అభినందించారు.