Nov 15,2022 23:51

ఎంపికైన విద్యార్థులతో ఎపి జెన్‌కో అధికారులు, పాఠశాల హెచ్‌ఎం తదితరులు

ప్రజాశక్తి - సీలేరు
జీకే వీధి మండలం సీలేరు డిఎవి పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ, ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో పాడేరులో నిర్వహించిన బాలుర ఖోఖో పోటీల్లో డిఎవికి చెందిన ఎస్‌కె.అమీర్‌ బాషా, ఎస్‌కె ఆషిక్‌, కబడ్డీ పోటీల్లో కె.నవీన్‌, కె.హేమంత్‌ అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం ఎంపికైన విద్యార్థులను, క్రీడల్లో శిక్షణ ఇచ్చిన పిఈటి కమలాకరణ్‌ను ఏపీ జెన్కో ఎస్‌ఈ (పాఠశాల ఎల్‌ఎంసి చైర్మన్‌) కెకెవి. ప్రశాంత్‌ కుమార్‌, ఈఈ జాకీర్‌ హుస్సేన్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రరావు, ఉపాధ్యాయులు, అభినందించారు. అనంతరం హెచ్‌ఎం రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లోనూ తమ సత్తా చాటి సీలేరు డిఏవి పాఠశాలకు పేరు తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.