ప్రజాశక్తి-వడ్డాది
రాష్ట్రస్థాయి జూడో పోటీలకు వడ్డాది విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అనకాపల్లిలో ఈనెల 13న జరిగిన జరిగిన జుడో ఛాంపియన్ ఫిప్‌లో ప్రతిభ కనబర్చి అనకాపల్లి జిల్లా తరుపున రాష్ట్ర స్థాయి పోటీలకు నుండి ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలకు వడ్డాది జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నుండి బాలికల విభాగంలో కె.కల్పన ఎస్.గీత, ఎన్.వరలక్ష్మి, ఆర్.దుర్గ, డి.రోహిణి, బాలుర విభాగంలో ఎస్.లోకేష్, టి.సంజరు, కె.గోవిందా రుత్విక్, కె.మధు, ఆర్.సింహాద్రి జయవర్ధన్ ఎంపికైన వారిలో ఉన్నారు. వీరు అనంతపురంలో జరగబోయే రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో పాల్గొంటారని పిడి కడగళ్ల నారాయణమ్మ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల హెచ్‌ఎమ్ పివి.శేషుబాబు, ఇన్‌ఛార్జి హెచ్‌ఎం వి.వెంకట్రావు, పిఈటి ఎల్.అప్పలనాయుడు, గ్రామ పెద్దలు, తోటి విద్యార్థులు అభినందించారు.










