
ప్రజాశక్తి -నక్కపల్లి : నక్కపల్లిలో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ అండర్ - 17 బాల బాలికల 67 వ రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను స్థానిక హాకీ క్రీడా ప్రాంగణం, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలోనూ ప్రారంభిం చారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖాధికారిణి ఎమ్.వెంకటలక్ష్మమ్మ, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ, క్రీడా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ రవిబాబు, ఎంపీపీ రత్నం, జడ్పిటిసి సభ్యురాలు కాసులమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, సర్పంచ్ జయ రత్నకుమారి, వైస్ ఎంపీపీ నానాజీ ,టిడిపి మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ తదితరులు హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ,క్రీడా జ్యోతిని వెలిగించి , జాతీయ జెండా,క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డీఈవో వెంకటలక్ష్మమ్మ అన్నారు. బలిరెడ్డి సత్యవతి హాకీ క్లబ్ ఏర్పాటు చేసి అనేకమంది విద్యార్థులను హాకీ క్రీడాకారులుగా తీర్చి దిద్దుతున్న హాకీ క్లబ్ ఫౌండర్ బలిరెడ్డి సూరిబాబు ను ఘనంగా సత్కరించారు. సహకారాలు అందిస్తున్న క్లబ్ ప్రధాన కార్యదర్శి కొల్నాటి తాతాజీ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
హౌరాహౌరీగా పోటీలు
హాకీ క్రీడా ప్రాంగణంలో బాలుర విభాగంలో మొదటి రోజు కడప-శ్రీకాకుళం, విశాఖపట్నం-కర్నూలు హాకీ జట్లు, స్ధానిక జిల్లా పరిషత్ హైస్కూలు క్రీడా మైదానంలో బాలికల విభాగంలో గుంటూరు-విజయనగరం, వెస్ట్ గోదావరి-చిత్తూరు, కర్నూలు-తూర్పు గోదావరి జిల్లాల జట్లు హౌరాహౌరీగా తలపడ్డాయి. 4,5 తేదీల్లో కూడా ఈ పోటీలు జరగనున్నాయి. పోటీలు ప్రారంభం ముందు విద్యార్థులు చేసిన ప్రదర్శనలు, నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి . ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మేడేటి శంకర్, కోసూరి శ్రీను, మీగడ సత్తిబాబు, ఎంఈఓ నరేష్, హెచ్‌ఎమ్. కోడి .శ్రీనివాసరావు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ ఎమ్.నాగేశ్వరరావు, ఎ.శేఖర్,కె.ఎమ్ నాయుడు, తెలుగు ఉపాధ్యాయులు ఆచార్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు