May 19,2023 18:33

కరపత్రం ఆవిష్కరించిన నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు ఇసాక్ భాష, రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ తదితరులు

రాష్ట్రస్థాయి చదరంగం పోటీల బ్రోచర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే శిల్ప రవి, ఎమ్మెల్సీ ఇసాక్
ప్రజాశక్తి - నంద్యాల

     ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా సంఘం నిర్వహణలో జూన్ నెల 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు నాలుగు రోజులపాటు నంద్యాలలో రామకృష్ణ పిజి కళాశాల ఆవరణలో జరగనున్న రాష్ట్రస్థాయి 19 సంవత్సరాల లోపు ఫిడే ర్యాంకింగ్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల వివరాలతో రూపొందించిన బ్రోచర్ ను శుక్రవారం నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శాసనమండలి సభ్యులు ఇసాక్ బాషా ఆవిష్కరించారు. నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రవి కృష్ణ ,రామ సుబ్బారెడ్డి, టోర్నమెంట్ చైర్మన్ హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో నంద్యాల జిల్లా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటీవల కాలంలో నంద్యాల ప్రాంతంలో చెస్ కు విశేష ఆదరణ రావడంలో నంద్యాల చెస్ అసోసియేషన్ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ఎమ్మెల్సీ ఇసాక్ భాష మాట్లాడుతూ చదరంగం మెదడుకు పదును పెడుతుందని, నంద్యాల చెస్ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించి జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు, నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ 50 వేల నగదు బహుమతులతో పాటు విజేతలకు ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాలు అందిస్తామని, రాష్ట్రం నలుమూలల నుండి  పోటీల్లో పాల్గొంటున్న వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మే 31వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాల కోసం చేయవలసిన ఫోన్ నెంబర్:9010451585. టోర్నమెంట్ చైర్మన్ హేమంత్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల ఆవరణలో పోటీల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.