బాల్ బ్యాడ్మింటన్ ఆడుతున్న క్రీడాకారులు
ప్రజాశక్తి-చోడవరం
66వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు మూడు రోజులపాటు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో ఉమ్మడి 13 జిల్లాల బాలురు బాలికల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన రెండు జట్లను ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలకు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వృత్తి విద్య అధికారి ఆర్.సత్యనారాయణ, షాప్ డైరెక్టర్ జె శ్రీనివాసరావు, స్కూల్ గేమ్స్ నిర్వహణ కార్యదర్శి జి రాంబాబు, డైరెక్టర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.










