స్వాతి
ప్రజాశక్తి - పొందూరు: విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన కొంచాడ గ్రామ సచివాలయం వెటర్నరీ అసిస్టెంట్ బెవర స్వాతి రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నుంచి స్వాతికి సమాచారం అందింది. సచివాలయాల్లో పనిచేస్తున్న పశుసంవర్థకశాఖ సహాయకులు అందించే పలురకాల సేవలకు రాష్ట్రస్థాయిలో ముగ్గురు ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేశారు. వారిలో స్వాతి మూడో స్థానంలో నిలిచింది. ఈనెల 15న అమరావతిలో నిర్వహించనున్న 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అవార్డును, ప్రశంసాపత్రాన్ని అందుకోనున్నారు. రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక కావడంపై పశుసంవర్థకశాఖ, సచివాలయ ఉద్యోగులు ఆమెకు అభినందనలు తెలిపారు.










