Nov 24,2022 00:00

దుర్గాప్రసాద్‌తో పాఠశాల ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-దేవరాపల్లి : రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి కక్కల దుర్గా ప్రసాద్‌ ఎంపికయ్యారు. ఉమ్మడి విశాఖపట్నం స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన పోటీల్లో దుర్గా ప్రసాద్‌ 200 మీటర్లు రన్నింగ్‌, 400 మీటర్లు రన్నింగ్‌, డిస్కో త్రోబాల్‌ పోటీలలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.చంద్రశేఖర్‌ బుధవారం విలేకరులకు తెలిపారు. అద్భుత ప్రతిభ కనబర్చిన దుర్గాప్రసాద్‌ను, ఆయన శిక్షణ వచ్చిన పిడి టి.నాగేశ్వరరావును హెచ్‌ఎం చంద్రశేఖర్‌, ఇన్‌ఛార్జి హెచ్‌ఎం ఎం.పాండురంగరావు, ఉపాధ్యాయులు అభినందించారు.