
ప్రజాశక్తి - ఉంగుటూరు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏలూరులో జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో జరిగిన జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీలలో అండర్-17 విభాగంలో కైకరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గెలుపొంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. స్విమ్మింగ్ ఫ్రీ స్టైల్ కేటగిరిలో రాగోలు లక్ష్మీ, శ్రీ చైతన్యకుమార్ ప్రథమ స్థానం, బ్యాక్ స్ట్రోక్ కేటగిరీలో రాగోలు భరత్ ప్రథమ స్థానం, కనమటి రాకేష్ ద్వితీయ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని పాఠశాల హెచ్‌ఎం గుళ్ల ప్రసాదరావు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను, వ్యాయామ ఉపాధ్యాయులు జి.నాగసుధ, పాపాయమ్మలను మండల విద్యాశాఖ అధికారి కె.శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.