Jul 25,2023 00:07

సమావేశంలో మాట్లాడుతున్న అప్పలనర్స

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌: మానవత్వాన్ని మంటగలిపేలా మణిపూర్‌ రాష్ట్రంలో చోటు చేసుకున్న అత్యంత ఆటవిక చర్యల నివారణకు రాష్ట్రపతి తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్శ డిమాండ్‌ చేశారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులోని సిఐటియు కార్యాలయంలో ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్‌.సుందరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మణిపూర్‌ అల్లర్లను అరికట్టడం లోనూ, ఆదివాసి మహిళలకు భద్రత కల్పించడంలోనూ విఫలమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మైతేలను ఎస్‌టి జాబితాలో చేర్పించి రాజకీయ ప్రయోజనం పొందేందుకే ప్రణాళిక బద్దంగా మణిపూర్‌ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చిచ్చుపెట్టారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతోనే ఆదివాసీలపై దాడులు జరుగుతుందని బాధిత మహిళలు ప్రకటించారని తెలిపారు. మణిపూర్‌ హింసకాండపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన మోదీ ప్రభుత్వ తీరుపై ప్రజలందరూ ఖండించాలని కోరారు. మణిపూర్‌ ఘటనపై రాష్ట్రపతి మౌనానికి కారణం బిజెపి అని తెలిపారు. రాష్ట్రపతి జోక్యం చేసుకుని శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులకు పరిహారం, నష్టపరిహారంతో పాటు వరద ప్రాంతాల్లో ప్రజలకు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 5, 6వ షెడ్యూల్డ్‌ ప్రాంతంలోని హక్కులు, రిజర్వేషన్‌ ఉల్లంఘన జరుగుతోందని, ఆదివాసీలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.
ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర మాట్లాడుతూ, అటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లు ద్వారా గ్రామ సభకున్న అధికారాన్ని రద్దు చేస్తున్నారని, ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు ఆమోదానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలను అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు. జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ మాట్లాడుతూ, మణిపూర్‌ ఆదివాసీ మహిళలపై పాశవిక చర్యలకు పాల్పడిన వారిపై వెంటనే ఎస్‌ సి, ఎస్‌ టి అట్రాసిటీ కేసు పెట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ చీకటి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి కె.భాగ్యలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షడు శెట్టి నాగరాజు, మెడికల్‌ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకుడు కె.లక్ష్మణ్‌, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి దాసమ్మ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రభుదాస్‌, నరేష్‌, చిన్నారావు, మాతృభాష విద్య వాలంటీర్ల సంఘం రాష్ట్ర నాయకులు సర్బు నాయుడు, సత్యబాబు, సత్యనారాయణ, గిరిజన సమాఖ్య జిల్లా కమిటీ నాయకులు లక్ష్మణ్‌, నిరుద్యోగ సంఘ నాయకులు వై.కుమార్‌ పాల్గొన్నారు.
ప్రజా సంఘాల ఆందోళన
అనంతగిరి: మణిపూర్‌ రాష్ట్రంలో హీంసాకాండను ఆపాలని ఆదివాసీ గిరిజన సంఘం, విద్యార్థి సంఘాల. ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద సోమవారం నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా జెడ్పీటీసీ దీసరి .గంగరాజు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి శాంతియుత వాతావరణం తీసుకు రావాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడి మౌనం వీడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సోమ్మేల నాగులు, టోకూరు సర్పంచ్‌ కిల్లో. మోస్య, గిరిజన సంఘం కార్యదర్శి జన్ని. సుబ్బారావు, మహిళా సంఘం నాయకులు దీసరి. దేముడుమ్మ, సీపీఎం నాయకులు గెమ్మెల దేవన్న, సురేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు
డుంబ్రిగుడ:మణిపూర్‌లో ఆదివాసి మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనను నిరసిస్తూ మానవ హక్కుల నేర నిరోధక సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి మండల పురవీధుల్లో ర్యాలీ కొనసాగించి ఘటనకు పాల్పడిన వ్యక్తులను తక్షణమే అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల నేర నిరోధక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కె కృష్ణకుమారి, అల్లూరి జిల్లా అధ్యక్షుడు పి.ధర్మ, ఆంధ్రప్రదేశ్‌ కోఆర్డినేటర్‌ కె.రవీంద్ర, కళాశాల అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.ప్రజాశక్తి-పాడేరుటౌన్‌: మానవత్వాన్ని మంటగలిపేలా మణిపూర్‌ రాష్ట్రంలో చోటు చేసుకున్న అత్యంత ఆటవిక చర్యల నివారణకు రాష్ట్రపతి తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్శ డిమాండ్‌ చేశారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులోని సిఐటియు కార్యాలయంలో ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్‌.సుందరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మణిపూర్‌ అల్లర్లను అరికట్టడం లోనూ, ఆదివాసి మహిళలకు భద్రత కల్పించడంలోనూ విఫలమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మైతేలను ఎస్‌టి జాబితాలో చేర్పించి రాజకీయ ప్రయోజనం పొందేందుకే ప్రణాళిక బద్దంగా మణిపూర్‌ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చిచ్చుపెట్టారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతోనే ఆదివాసీలపై దాడులు జరుగుతుందని బాధిత మహిళలు ప్రకటించారని తెలిపారు. మణిపూర్‌ హింసకాండపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన మోదీ ప్రభుత్వ తీరుపై ప్రజలందరూ ఖండించాలని కోరారు. మణిపూర్‌ ఘటనపై రాష్ట్రపతి మౌనానికి కారణం బిజెపి అని తెలిపారు. రాష్ట్రపతి జోక్యం చేసుకుని శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులకు పరిహారం, నష్టపరిహారంతో పాటు వరద ప్రాంతాల్లో ప్రజలకు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 5, 6వ షెడ్యూల్డ్‌ ప్రాంతంలోని హక్కులు, రిజర్వేషన్‌ ఉల్లంఘన జరుగుతోందని, ఆదివాసీలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.
ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర మాట్లాడుతూ, అటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లు ద్వారా గ్రామ సభకున్న అధికారాన్ని రద్దు చేస్తున్నారని, ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు ఆమోదానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలను అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు. జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ మాట్లాడుతూ, మణిపూర్‌ ఆదివాసీ మహిళలపై పాశవిక చర్యలకు పాల్పడిన వారిపై వెంటనే ఎస్‌ సి, ఎస్‌ టి అట్రాసిటీ కేసు పెట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ చీకటి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి కె.భాగ్యలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షడు శెట్టి నాగరాజు, మెడికల్‌ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకుడు కె.లక్ష్మణ్‌, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి దాసమ్మ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రభుదాస్‌, నరేష్‌, చిన్నారావు, మాతృభాష విద్య వాలంటీర్ల సంఘం రాష్ట్ర నాయకులు సర్బు నాయుడు, సత్యబాబు, సత్యనారాయణ, గిరిజన సమాఖ్య జిల్లా కమిటీ నాయకులు లక్ష్మణ్‌, నిరుద్యోగ సంఘ నాయకులు వై.కుమార్‌ పాల్గొన్నారు.
ప్రజా సంఘాల ఆందోళన
అనంతగిరి: మణిపూర్‌ రాష్ట్రంలో హీంసాకాండను ఆపాలని ఆదివాసీ గిరిజన సంఘం, విద్యార్థి సంఘాల. ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద సోమవారం నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా జెడ్పీటీసీ దీసరి .గంగరాజు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి శాంతియుత వాతావరణం తీసుకు రావాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడి మౌనం వీడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సోమ్మేల నాగులు, టోకూరు సర్పంచ్‌ కిల్లో. మోస్య, గిరిజన సంఘం కార్యదర్శి జన్ని. సుబ్బారావు, మహిళా సంఘం నాయకులు దీసరి. దేముడుమ్మ, సీపీఎం నాయకులు గెమ్మెల దేవన్న, సురేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు
డుంబ్రిగుడ:మణిపూర్‌లో ఆదివాసి మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనను నిరసిస్తూ మానవ హక్కుల నేర నిరోధక సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి మండల పురవీధుల్లో ర్యాలీ కొనసాగించి ఘటనకు పాల్పడిన వ్యక్తులను తక్షణమే అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల నేర నిరోధక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కె కృష్ణకుమారి, అల్లూరి జిల్లా అధ్యక్షుడు పి.ధర్మ, ఆంధ్రప్రదేశ్‌ కోఆర్డినేటర్‌ కె.రవీంద్ర, కళాశాల అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.