Jun 09,2023 00:18

బస్సుకు ఊపి ప్రారంభించిన పిఒ

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు మేరకు పాడేరు ఐటిడిఎ పరిధిలోని 120 పివిజిటిలను ఢిల్లీ రాష్ట్ర పతి భవన్‌కు ప్రయాణ మయ్యారని ఐటిడిఎ పిఒ వి.అభిషేక్‌ స్పష్టం చేసారు. గురువారం ఐటిడిఎ కార్యాలయం వద్ద పచ్చ జెండా ఊపి పిఒ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా డిల్లీ ప్రయాణమైన ఆదివాసీ గిరిజనులతో మాట్లాడుతూ, దేశంలో 29 రాష్ట్రాలను 1500 ఆదివాసీలకు రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం వచ్చిందన్నారు. ఆదివాసీ సమస్యలను అడిగి తెలుసుకుని విటిజి గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటారన్నారు. ఐటిడిఎ పరిధిలోని అనంతగిరి మండలం నుండి 15 మంది, అరకు వ్యాలీ 13, డుంబ్రిగుడ 15, ముంచంగిపుట్టు 11, హుకుంపేట 15, పాడేరు 15, జి.మాడుగుల 10, కొయ్యూరు 15, జికె వీధి మండలం నుండి 11 మందిని డిల్లీకి పంపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఒలు విఎస్‌ ప్రభాకర్‌, ఎం.వేంకటేశ్వరరావు, పరిపాలనాధికారి హేమలత, సెంట్రల్‌ కాపీ బోర్డు మెంబరు ఉమా మహేశ్వరరావు, ట్రైకార్‌ అసిస్టెంట్‌ ఎన్‌.సీతారామయ్య పాల్గొన్నారు.
రాష్ట్రపతి భవన్‌కు 120 మంది పివిటిజిలు
ఐటిడిఎ పిఒ వి.అభిషేక్‌