Feb 17,2023 00:00

మాట్లాడుతున్న ఆదిశేషు

ప్రజాశక్తి-బాపట్ల : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నివాస ప్రాంతంలోనే వికలాంగులకు రక్షణ లేదని భావపురి వికలాంఉల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు, జనసేన నాయకులు గోగన ఆదిశేషు ఆందోళన వ్యక్తం చేశారు. గురు వారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లిలో అంధురాలు రాణి హత్య జరిగి ఆరు రోజులైనా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణ మన్నారు. రాణి అత్యాచారానికి హత్యకు దారి తీసిన పరిణామాలపై ముఖ్యమంత్రి స్పందన కరువైందన్నారు. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక రాష్ట్రంలో వికలాంగ మహిళల పై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగినట్లు తెలిపారు. రాణి హత్యకు కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి , దేవి రెడ్డి, శ్రీనివాసరావు, వికలాంగులు పాల్గొన్నారు.