ప్రజాశక్తి -వెంకటాచలం :జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివద్ధి, సంక్షేమంలో ముందుకు దూసుకెళ్తోందని వ్యసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.మండలంలోని చెముడుగుంట వద్ద ఉన్న శ్రిడ్స్ కళ్యాణ మండపంలో గురువారం నియోజకవర్గస్థాయి సచివాలయ కన్వీనర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సంక్షేమం, అభివద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. మంత్రి అభివద్ధి, సంక్షేమం గణాంకాలతో ఎల్‌ఈడి స్క్రీన్ పై ప్రదర్శించి వివరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నేడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వరకు జరిగిన అభివద్ధి సంక్షేమాన్ని వివరించారు. రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం తర్వాత 2009 నుంచి 2019 వరకు పదేళ్లపాటు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. అనంతరం కొత్త రాష్ట్రానికి అనుభవజ్ఞుడని చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రినిచేస్తే రాష్ట్రాన్నే అంధకారంలోకి నెట్టేశారన్నారు. అధికార ప్రతినిధి మందల వెంకట శేషయ్య సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎంపిపిలు, జెడ్‌పిటిసలు ఉన్నారు.










