
ప్రజాశక్తి -పెనుకొండ : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శి సవితమ్మ విమర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ మంగళవారం పట్టణంలోని ఎన్ టి ఆర్ సర్కిల్‌లోని తన కార్యాలయం వద్ద రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్షను సవితమ్మ కొనసాగించారు. ఈ సందర్బంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న, చంద్రదండు ప్రకాష్ నాయుడు తదితరులు ఆమెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా సవితమ్మ మాట్లాడుతూ లేని కేసులో చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చేసిన జగన్ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందన్నారు. రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీని తరిమికొట్టేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కదిరి అర్బన్ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా కదిరి పట్టణం లో టిడిపి కదిరి నియోజవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు .ఈ రిలే నిరాహార దీక్షలకు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి నాగన్న మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనకు అంతిమ రోజులు దగ్గర పడ్డాయన్నారు.
గుడిబండ : చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా మడకశిర నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లుదాదాపు పది కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మడకశిర నియోజకవర్గం టిడిపి పరిశీలకులు పులివెందుల పార్థసారథి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, గుడిబండ మండల కన్వీనర్ మ ద్దనకుంటప్ప, జిల్లా వీరశైవ సాధికార కన్వీనర్ దుర్గేష్, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి సురేష్, మాజీ ఆసుపత్రి కమిటీ చైర్మన్ శివకుమార్, ప్రధాన కార్యదర్శి ప్రకాష్, క్లస్టర్ ఇన్‌ఛార్జులు, తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆదేశాల మేరకు ఆయన అనుచరులు పట్టణంలోని 35వ వార్డులో పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. ఈ మేరకు పోస్టుకార్డులపై ప్రజలతో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకుల దుస్సాక్రిష్ణ, గంధమనేని నారాయణస్వామి, మల్లికార్జున, జయరాములు, చౌడప్ప, వీరభద్రప్ప, సయ్యద్ బాబా,. రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రొద్దం : చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, ఆయన సతీమణి కమలమ్మ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట మహిళలు 14వ రోజు సామూహిక రిలే నిరాహారదీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నరసింహులు, సత్య సాయి జిల్లా మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, పెనుగొండ నియోజకవర్గం అధ్యక్షులు చిన్నప్పయ్య, రొద్దం మాజీ సర్పంచి అశ్వర్థ నారాయణ మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : ముఖ్యమంత్రి జగన్ అన్ని వర్గాల ప్రజలను మోసగించారని టీడీపీ నాయకులు విమర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్షలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ దీక్షల్లో టీడీపీ నాయకులు చీమల రామాంజి. అడ్రమహేశ్, వెంకటేశ్వర్లు, కత్తులబాబ్జి, బత్తలగంగాధర్, బీరే శీన, మాబు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : పైశాచిక ఆనందం కోసమే చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిందని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి అన్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పట్టణంలో చేపట్టిన దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం చేపట్టిన దీక్షల్లో తెలుగు మహిళలు కళ్లకు నల్ల టేపు కట్టుకుని నిరసన తెలిపారు. ు. మహిళలు చేపట్టిన దీక్షను సాయంత్రం సీనియర్ నాయకులు నాగరాజు, పట్టణ అద్యక్షులు రమేష్‌కుమార్‌లు నిమ్మరసం ఇచ్చి విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రామాంజినమ్మ, తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి పరిమళ, పట్టణ అధ్యక్షురాలు విజయలక్ష్మి, కౌన్సిలర్లు మంజుళ, భారతి, మహాలక్ష్మి, పార్లమెంట్ రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శి వెంకటలక్ష్మి, పార్లమెంట్ కార్యదర్శి చెన్నమ్మ, గీతమ్మ, నాగమణి, లక్ష్మీదేవి, అరుణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి అర్బన్ : చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 14వ రోజుకు చేరాయి. మంగళవారం పట్టణంలోని టిడిపి కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, తదితర నాయకులు పాల్గొని మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైసిపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ బాబు విడుదల అయ్యేవరకు తమ పోరాటాలు ఆగదని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సామకోటి ఆదినారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రత్నప్ప చౌదరి, శ్రీరామ్ రెడ్డి, అంబులెన్స్ రమేష్, పేపర్ గంగాద్రి, టిడిపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముదిగుబ్బ : చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై సాయంత్రం కొవ్వొత్తులతో శాంతి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అభిమానులు దేవేందర్ నాథ్ రెడ్డి , నారాయణస్వామి, లక్ష్మీనారాయణ , బాల భాస్కర్ ,రెడ్డప్ప , సురేష్ రెడ్డి, రామాంజి తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : చంద్రబాబు నాయుడు వెన్నంటే బీసీ కులాలు ఉన్నాయని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ కందికుంట ఆధ్వర్యంలో పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 17వ రోజు కొనసాగాయి. నియోజకవర్గం నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఈసందర్భంగా తమ సంఘీభావం ప్రకటించారు.