ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనను ఇంటికి సాగనంపే వరకూ ప్రజల్లోనే ఉండాలని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి పిలుపునిచ్చారు. విజయ దశమి పండుగను పురస్కరించుకుని బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా అనంతపురం అర్బన్ పార్టీ కార్యాలయం వద్ద సైకో పోవాలి అని రాసిన పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవస్థలన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకుని సిఎం జగన్ ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి రాక్షస పాలన పోవాలంటే వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మారుతీకుమార్‌గౌడ్, దేవళ మురళి, సరిపూటీ రమణ, నారాయణస్వామి యాదవ్, సుధాకర్‌యాదవ్, బంగి నాగ, వెంకటేష్, పూల బాషా, జెఎం బాషా, గోపాల్‌గౌడ్, చేపల హరి, బొమ్మినేని శివ, డైమండ్ రఫీ, బోయపాటి బాలప్ప, వడ్డే మురళి, సున్నం శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురంలో 'సైకో పోవాలి' కరపత్రాలను దగ్ధం చేస్తున్న టిడిపి నాయకులు










