Sep 01,2023 00:17

ప్రజాశక్తి - చీరాల
రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ఎంఎం కొండయ్య అన్నారు. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు తలపెట్టిన యువగళం పాదయాత్ర రెండు వందల రోజుకు చేరుకున్న సందర్భంగా ఆ పార్టీ ఇంచార్జి ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో గురువారం చీరాల టుబాకో కంపెనీ వద్ద నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. లోకేష్ బాబు తలపెట్టిన యువ గళం పాదయాత్ర రెండు వందల రోజుల్లో రెండువేల కిలోమీటర్లపైబడి చేరుకుందని అన్నారు. సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ముద్దులు వచ్చిన అధికారానికి వచ్చిన తరువాత గుద్దులు గుద్దుతున్నట్లుగా సాగుతోందని అన్నారు. రేపటి నుండి నలభై రోజుల పాటు ఈ యాత్రలు సాగుతాయని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విఫలయ్యారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.